Saturday, 20 June 2015

 అయిదుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు 
ఆయన భార్య 
వాల్లకడుపులు కష్టాలు బాధలు కన్నీళ్లు మా ''నాన్న''
నాకు తెలిసిన మా ''నాన్న'' కు 
కోపమెక్కువ  కానీ కన్నకడుపుల మమ్మల్ని యేనాడు ఉపవాసాలు ఉంచలేదు
రేకుల తండ మూడు కిలోమీటర్లు, నాగారం ఏడు కిలోమీటర్లు
ఆయనకు తెలిసింది కరెంట్ పని అరకపని బండు శాకిరి పొద్దుగాల లేస్తే 
నెత్తిన ఒడ్ల బస్తా పెట్టుకొని మెడను ఓర్చుకొని మోసుకొచ్చి మా ఆకలి తీర్చడం ఆయన లక్ష్యం 
మాకోసం ఆయన తొక్కిన సైకిలు కిలోమీటర్లు వేలు లక్షలు 
కష్టాలంటే మామూలు కష్టాలు కాదు కానీ ఎవ్వరికీ ఏం తక్కువ చేయలేదు 
అందరికీ అక్షర జ్ఞానం నేర్పించాడు తను చదువుకున్నట్లు మామూలుగా కాదు 
తనలా కష్టపడకుండా ఉండాలనేదే ఆయన తపన, కులవృత్తి కూటి బాధల అనుభవాలను 
ఏమనుకున్నాడో కానీ కొడుకులు ఆ కష్టాలు పడొద్దని సదువుకొమ్మని పట్టుబట్టిన సదుద్దేశి 
పిరికెడు బియ్యం కడుపు నింపినా తనలా కష్టపడొద్దని రెక్కొడిన కష్టశీలి 
ఆడపిల్లలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు వాళ్ళ కళ్ళల్లో ఆనందాలు చూడడానికి
 అహర్నిశలు కష్టపడ్డ అలుపెరగని అనుభవాలు ఆయన 
78 వయసులో కూడా నేనున్నారా మీకోసమని అవిశ్రాంత ధైర్యం ఆయన మాటలు 
మాకు ఎనలేని శక్తి 
 నీ కష్టం మా జీవితం నీ ప్రయత్నాలు మా జీవనం నీ అనుభవాలు మా ప్రగతి 
నీ ప్రేరణ మా భావిజీవితం నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం 
నీ ఆశీర్వాదం నా అభివృద్ది 
ఆరోగ్యంగా కలకాలం ఉండి మా ఊపిరై మమ్మల్ని కాపాడిన ''నాన్నా'' నువ్వే నా ఆరాద్యుదీవి 
సదా సర్వకాల పూజ్యుడా నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు 

దీనబాంధవ 
   
  






No comments:

Post a Comment