చంద్రుడా సల్లగ బతుకు బతుకు
బీడు వారిన పాడు బతుకుకు తోడుగుండి నీడవైతివి
గడ్డపారాలు బయట పెడితివి గంప నెత్తిన పెట్టమంటివి
కూటి తిప్పలు కోటిమందివి కాలరాస్తివి కనికరిస్తివి
సద్దిమూటలు కట్టి రైతులు సల్లగుండాలంటు గట్టిగ
తెలంగాణ మట్టి మనిషికి బలము వైతివి చంద్రుడా
సల్లగ బతుకు బతుకు
నాటు పెట్టె నాటికీ నీటి నిల్వలు నిండుగుంటే
పంటలేసిన పదును భూమి పచ్చ పచ్చగ విచ్చుకొంటే
మొలకలెత్తే మొదటి రోజు మొఖము నిండా ధైర్యముండి
సాలు సాలును సాగుచేసి మడుల నిండా దారలైతే
బాగుపడతడు రైతన్నని బాగుకోరిన చంద్రుడా
సల్లగ బతుకు బతుకు
నిల్వ నీల్లకు తావునిస్తే చెరువు నిండా నిండి ఉంటే
పలుగు పారలు పట్టేటోల్లు గట్లు షెల్కలు చేసేటోల్లు
గుండె ధైర్యంగుంటదని రైతు గుండెను తెల్సుకోని
పదవి పొందిన నాటినుండే పాటుపడుతూ పరుగులెడుతూ
చెరువు తల్లికి చేయి కలపని గొంతు నెత్తిన చంద్రుడా
సల్లగ బతుకు బతుకు
No comments:
Post a Comment