Wednesday, 29 January 2014

               ఏడవడం తప్ప 


విధ్వంసం ఇలా విస్తరిస్తే మారణహోమం తాండవమాడుతూ 
సాధించాల్సిన జీవితాలకు చావును,నివసిస్తున్న నేల ధరి చేర్చితే 
ఎవరిని నిందిద్దాం............ 

వందల వేల లక్షల కిలోమీటర్లు రాక్షస హృదయాలు ప్రయాణించి 
కోరలుచాచి కొదమ సింహాలై ఎగబడి అమాయక ప్రాణాలను బలిగొంటే
ఎవరిని నిందిద్దాం............

సహనం ,శాంతి సమస్తం మన దేశ సంస్కృతి అని
అశాంతి నెలకొల్పే వింత జంతువులూ వీదిన పడి
విషవలయాన్ని సృష్టిస్తున్న రాబంధులను మోస్తున్న కర్మభూమిని
ఏమని ప్రశ్నిద్దాం ఎవరిని నిందిద్దాం............

చీకటి వేళ కాటికి పోయిన భర్త జాడలు కమ్ముకున్న
ఇళ్ళ బతుకులను ఆదుకునే అనాథ నాథుడెవడు
బెదిరిన అలసిన తలిదండ్రులకు ఆధారమైన ఆప్తుడు కలేభరమై కనిపిస్తే
శోకం తప్ప లోకంలో మన ప్రభుత్వ తీరు మరదన్న వేదనకు
ఏమని బదులిద్దాం .............. చూసి ఏడవడం తప్ప

  
దీనబాంధవ 

Sunday, 26 January 2014

మాఊరి వాలుజడ.....

నల్లని నాగు పాము దాని నడక .... 
వయ్యారంగా ఒంకలు దాటుతూ సాగే దాని హొయలు వర్ణనాతీతం.....  
అందానికే వన్నె తెచ్చే దాని హంగులు అమాయకపు కన్నెపిల్ల వాలు చూపులు..... 
దరి చేరి స్పర్శిస్తే చాలు మనసునిండా మైమరపు......  
తియ్యని తలపు దాని సేవనం.......
ముద్దు ముద్దు అలరికలు దాని సొంతం.....
కసిరేపే ముసి ముసి నవ్వులు దానికి అలంకారం.....
అమాంతం హాయిగొలిపే స్వరజతులు దాని సవ్వడులు.... 
పిట్ట పిల్లల హూంకార ధ్వనులు గట్టు పై పలకమనే పసిడితనం ..... 

ఇది మాఊరి వాలుజడ  మా వాగు ......
ప్రవాహ వాహిని నా చల్లని తల్లి........  


దీనబాంధవ 
 వేయి గొంతులకి.......... 

మా ఊరు పెను అందాల పొదరిల్లు.
చక్కనైన చేలు ఇంపుగాను ,సొగసైన వాగొంక... సిరి గళ్ళ చెరువీది.....
రాములోరి గడ్డ రమ్యనగరి. ముత్యాల ముంగిళ్ళు, రతనాల వాడళ్ళు ...వీది వీది విద్య బాలురుల్లు... చెలిమి కల్ల గుణులు, బలిమి కలిగి బంధు ,సఖులు సఖ్య సర్వ సంపదల్లు...హితముగోరు మితము...హతము చేయు కీడు సతతమ్ము సావడి...విద్య నిచ్చు వినయ వేనోల్లు పొగుడు బడి...ప్రజలెల్ల పూజింప నాగేంద్రుని గుడి ,ఆప్తులై రైతన్న నింపార నారు మడి...గొడ్డు గోద మేక ఆవు అమృతవర్షి ....నిత్య 
పూజల నంది వాహనుడేచి...కుల మతాలూ లేని మదారుసాబుగుడి....వర్ణింప కలుగు పోల అందాల పుప్పొడి........ నా ఊరు నాతల్లి..... కమనీయ కల్పతరి వెలుగెత్తి చాటనా ?మరి వేయి గొంతులకి.......... 
  
                          సదా మీ గమ్య క్షేమంకరి.........  

                  పోటు పొరపాటు 

    తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేని సమయాన్ని సరిదిద్దడానికి ఒక నాయకుడు కావాలి 
                          దానికి నా సాయం కావాలి ......... 

  కాలేజి  బాగోగులు చూడడానికి కష్ట నష్టాలని తీర్చడానికి  యువ కిశోరం ఒకరు కావలి. 
                          దానికి నా సాయం కావాలి ......... 

  కళాశాల నిర్మాణానికి  పరిపాలనకి ఒక కమిటీ కావాలి ఆ కమిటీకి ఒక వ్యక్తి శక్తిగా కావాలి 
                       దానికి నా సాయం కావాలి ......... 

విశ్వవిద్యాలయ ఉపకులపతిని నియమించడానికి ప్రభుత్వం అన్నివిధాలా ఉన్నతమైన విద్యా వంతున్ని 
నియమించడానికి ఆలోచించాలి .... దానికి నా సాయం కావాలి ......... 

యూనియన్ల యశస్సులు యావత్తు దేశానికో,రాష్ట్రానికో,ఆయా ప్రాంతానికో ,ఆయా ఫ్యాక్టరీలకో తెలియాలంటే 
ఒక న్యాయమైన నాయకుడు కావలి....  దానికి నా సాయం కావాలి ......... 

పరిశోధించిన వెలుగులు ప్రపంచానికి పంచాలని పరితపించే పరిశొదకుని ప్రయత్నాలు పదిమందికి తెలియాలంటే 
ఒక నాయకుడి సాయం కావాలి  నయకుడవ్వాలంటే ...... దానికి నా సాయం కావాలి ......... 

ఒక రంగు జెండా ఒక నిజమైన ఎజెండా ఉంచుకొని మమ్మల్ని ఎంచుకొమ్మని ప్రజా క్షేత్రంలో  తన నిజాయితీ నిరూపించుకోవడానికి పరుగెడుతున్న పాటుపడుతున్న ఎందరికో నేను కావాలి ... దానికి నా సాయం కావాలి ......... 

ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా పదికాలాలపాటు పచ్ఛగా బ్రతకాలంటే పజలచేత నియమింపబడేందుకు ఒక నాయకుడు కావాలి .... దానికి నా సాయం కావాలి ......... 

ఇలా ఒకటా రెండా యావత్తు ప్రపంచ పరిపాలనలు నాలోని ప్రాణాలు సంవత్సరానికో,మూడు సంవత్సరాలకో, ఐదు సంవత్సరాలకో, వాడుకోవడానికి ,మీ మీ కుయుక్తులకీ ,మీ మీ రాజకీయాలకీ , రాక్షసత్వానికి,రాచరికాలకి, అమాయకపు క్షేత్రంలో నన్ను బలి చేసి ,నా పేరును, కీర్తిని నిలువునా ముంచి నా నుండి జయించి , నన్ను గెలిచి 
నాపేరునే లాలూచి పరచి నడి సంద్రాన నా శీలాన్ని నలుగురిలో అమ్మి నీ ఆనందాలను అనుభవిస్తున్న నిజాయితీ పరుడా నీకు ఏ పదాలను పూరించినా సరితూగవు ..... ఇందుకా నేను సహాయపడాలి 

అందరి హృదయాల నుండి ఆనందాల నడుమ ధైర్యంగా, బాధ్యతగా రావలసిన నన్ను నా పేరే పలికేందుకు సిగ్గుపడేలా తయారుచేస్తున్న నాయకులారా వందనం ఇది నాకు నిజమైన వెన్నుపోటు ,దానిని సరిదిద్దుకోక పోవడం నీ పొరపాటు ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా  చెప్పలేక సిగ్గుతో చెప్పుకునే దీనురాలిని 
                                                                      ఓటుని.........     
                                                              
                                                                                                   దీన బాంధవ 

Wednesday, 8 January 2014

                         
                               ప్రయాణం

ఆరంభ దశలో పాదాలకు తెలయక ఉండొచ్చు గమ్యం 
ప్రయాసపడి సంధ్య వేళ వరకు సాగిన గమనం సూచించ వచ్చు విశ్రాంతం 
సేదతీరిన తనువు తపించవచ్చు చేరలేకపోయానే గమ్యం, అని 
ఆలోచనలకు అందని ఆరంభం, అనుభవానికి అందని పరమార్థం 
మానవుని ప్రతి నిత్య జీవన ''ప్రయాణం'' జీవితం.. 
ఆపే వరకూ ఆపకు  ఆగిననాడు ఆపకు........ 
                                         
                                         Rj  దీనబాంధవ