Monday, 27 April 2015

క్షమించు తల్లీ

                                                            క్షమించు తల్లీ 
కోపం మాపైన ఎందుకమ్మా 
కన్నా బిడ్డలపైన తల్లికి కోపమా... ? 
నవమాసాలు మోసిన తల్లికి మేము 
కొంతే ఋణపడి ఉన్నా.... 
నిరంతరం మమ్మల్ని నీ భుజస్కందాల పైన మోస్తూ 
అల్లారుముద్దుగా ఆలనా పాలనా చూసుకుంటూ కడుపులో పెట్టుకొని 
చూసుకునే నీకు మేమెప్పుడూ రుణపడే ఉంటామమ్మా .... 
ఎక్కడో తెలిసీ తెలియక ఏదో చిన్న చిన్న తప్పులు 
చేస్తే వేల ప్రాణాలను ఎందుకు తల్లీ పొట్టన పెట్టుకుంటున్నావు
ఒహో మేము నీ కడుపులో పుట్టలేదు కదా అందుకా 
అమ్మా అన్నీ తెలిసిన అమ్మలగన్న మాయమ్మవి 
దుర్మార్గాలను దుష్టులను వదిలేసి 
అమాయకుల జీవితాలను అంధకారంతో అతలాకుతలం చేస్తున్నావు అమ్మా..  భూమాతా అందరం నీ బిడ్డలమే కదా తల్లీ 
క్షమించి శాంతించు తల్లీ.....   

No comments:

Post a Comment