Monday, 27 April 2015

క్షమించు తల్లీ

                                                            క్షమించు తల్లీ 
కోపం మాపైన ఎందుకమ్మా 
కన్నా బిడ్డలపైన తల్లికి కోపమా... ? 
నవమాసాలు మోసిన తల్లికి మేము 
కొంతే ఋణపడి ఉన్నా.... 
నిరంతరం మమ్మల్ని నీ భుజస్కందాల పైన మోస్తూ 
అల్లారుముద్దుగా ఆలనా పాలనా చూసుకుంటూ కడుపులో పెట్టుకొని 
చూసుకునే నీకు మేమెప్పుడూ రుణపడే ఉంటామమ్మా .... 
ఎక్కడో తెలిసీ తెలియక ఏదో చిన్న చిన్న తప్పులు 
చేస్తే వేల ప్రాణాలను ఎందుకు తల్లీ పొట్టన పెట్టుకుంటున్నావు
ఒహో మేము నీ కడుపులో పుట్టలేదు కదా అందుకా 
అమ్మా అన్నీ తెలిసిన అమ్మలగన్న మాయమ్మవి 
దుర్మార్గాలను దుష్టులను వదిలేసి 
అమాయకుల జీవితాలను అంధకారంతో అతలాకుతలం చేస్తున్నావు అమ్మా..  భూమాతా అందరం నీ బిడ్డలమే కదా తల్లీ 
క్షమించి శాంతించు తల్లీ.....   

Thursday, 23 April 2015

                        ఉపయోగ పడుతున్నామా మిత్రమా ...... 

కోడి ,మేక ,గొర్రె ,అమాయకపు జంతువులూ ప్రతి ఆదివారం వాటి ప్రాణాలను ప్రజలకు పంచి  రుచికి ఉపయోగపడుతున్నాయ్ ఎలాగో తెలుసా మాంసపు ముద్దల్లా నరుక్కొని నరుక్కొని తింటున్నాం 
మరి మేధాస్సులేని మేకకన్నా మీరేం తక్కువగాదు మిత్రమా మనకున్న బుద్ధి , ఆలోచన ,వాటికి లేదు అయినా 
మనకు ఆనందాన్ని ఆకలిని తీరుస్తున్నాయి...  అన్నీ ఉన్నా మనం ఎవరికన్నా ఎలాంటి ఉపయోగాన్నైనా ఇవ్వగాలుగుతున్నమా లేదాని మాంసం  తినేప్పుడు ఆలోచించండి మిత్రమా 

అనుభవిద్దాం అనుభవమైనా వస్తుంది కదా .... 



600 ల దెబ్బలు తినే ప్రాణం లేని ఒక "బంతి" 11 మంది మాత్రమే ఆడే క్రికెట్ ఆటలో ఒక దేశ గౌరవాన్ని గెలిపిస్తుంది... మరి అన్నీ చేయగలిగిన మనం అనుకుంటే ఏ పని అయినా అసాధ్యమా మిత్రమా దెబ్బలు తగలనీ ప్రతి దెబ్బకీ ఎదురు వెళ్దాం ...... మంచి అనుభవమైనా వస్తుంది ప్రయత్నం మాత్రం ఆపొద్దు గెలిచేవరకు .............. 
దీనబాంధవ