పాపికొండలు
తన సవ్వడులను సడి చేస్తూ ప్రయాణాన్ని సాగిస్తుంటుంది అలలమ్మ...........
రమణీయమైన ఈ జల యానంలో మనల్ని తీరాలకు
చేర్చుతుంది అక్కడి నావమ్మ ...........
కమనీయ స్పందనల ఆనందాలతో పరవశించి పోతుంది మనలోని హృదయమ్మ ..........
ఈ అందాలనే చూసి అలసి పోకు ముందు ముందు ఇంకా ఉన్నాయి ముందైతే తినమని కడుపు నింపుతుంది అన్నపూర్ణమ్మ ..........
మధ్యాన్న భోజనం అయ్యాక మళ్ళీ సాగిస్తుంది మన నీటిపైన మన విహార యాత్రమ్మ........
మానసిక ఉల్లాసాలను మనస్సు పులకరించిన
రీతులను మది నిండా నింపుకొని మళ్ళీ రా నేస్తమా
అంటూ సాగనంపుతుంది సాయం సంధ్యవేలమ్మ ......
నాయనానందకరమైన ఈ సుందర దృశ్యాలను వర్ణించు మిత్రమా అని అడిగింది నా కలమమ్మ
No comments:
Post a Comment