Saturday, 2 May 2015

                     క్షణిక కాలం 
యనించే జీవిత గాలిపటం క్షణిక కాలం
పిలుపులను మాన్పించే మరణం క్షణిక కాలం 
ప్రకృతిని  చూపించే జననం క్షణిక కాలం 
పడిలేచే కడలి తరంగం క్షణిక కాలం
ప్రయోగపు విజయ బావుటా క్షణిక కాలం
తరతరాల రాతలను మార్చడం క్షణిక కాలం
తెలవారే ముందు వెలుగు  చీకటి క్షణిక కాలం
తెరచాటు నగ్న సత్యం విలువ క్షణిక కాలం
ఎండ మావుల వేడి వెన్నెల క్షణిక కాలం 
ఏడిపించే అనుభవాలు క్షణిక కాలం 
వలచి వచ్చిన వేడి వేసవి క్షణిక కాలం 
ముసురుగప్పిన మబ్బు మనసు క్షణిక కాలం